నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణి
హైదరాబాద్ , ఇయ్యాల తెలంగాణ మే 11 :
పాత నగరంలోని నిరుపేద కుటుంబాలకు బి. జే.పి. పార్టీ ఆధ్వర్యములో ఈ రోజు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం జరిగింది. పాతబస్తీ బి జె పి నాయకులు సి.హెచ్ . రూప్ రాజ్ ఆధ్వర్యంలో లోప్రజలకు కావలసిన కిరాణా నిత్యావసరాల కిట్లను పంచడం జరిగింది. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారికి సంస్థ నుండి అందవలసిన పి.ఎఫ్. ఇ.ఎస్. ఐ. వసతులు వచ్చేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో అరవింద్ ఎస్. ఐ., రాజేష్ ,ధీరజ్ ,మోకాల వెంకటేష్ , దుర్గేశ్ గౌడ్ ,మహేష్ ,భాను ,కన్వీనర్ రఘు పాల్గొన్నారు.