నిరాడంబరంగా NTR జయంతి వేడుకలు

నిరాడంబరంగా NTR జయంతి వేడుకలు

హైదరాబాద్ మే 28 (ఇయ్యాల తెలంగాణ)
తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలా ఖ్యాతి గడించేలా చేసిన  స్వర్గీయ నంద మూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని  పాతనగరంలోని సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జయంతి  వేడుకలు నిరాడంబరంగా  జరిగాయి. యాకుత్ పుర నియోజక వర్గం పరిధిలోని  గౌలిపురా ప్రాంతంలో ఏర్పాటు చేసిన NTR జయంతి వేడుకలో పార్టీ కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొందరు సీనియర్ నాయకులు ఆయన చేసిన సేవలను గూర్చి కొనియాడారు. పార్టీ జండాను ఎగురవేసి కొద్దిసేపు మౌనం పాటించారు. పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆవుల భరత్ ప్రకాష్ నందమూరి తారక రామారావు చేసిన సేవలను  గుర్తు చేశారు. తెలుగువారి తేజం, గుండె చప్పుడు అయిన స్వర్గీయ ఎన్.టి ఆర్ గురుంచి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సల్ల రాజ్ కుమార్, బి వై శ్రీకాంత్, కె. కుమార్ స్వామి,కె ఎస్. సురేష్ కుమార్,జోగిందర్ సింగ్,సత్య కృష్ణ,ఆర్ అజయ్ కుమార్,ఎం.యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....