నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ
హైదరాబాద్ మే 19, (ఇయ్యాల తెలంగాణ )
బహదూర్ పుర నియోజక వర్గం పరిధిలోని పలు డివిజన్ ల పరిధిలో ఈ రోజు కూడా పేద ప్రజలకు నిత్యావసర పంపిణీ కార్యక్రమం కొనసాగింది. గత లాక్ డౌన్ మొదలైన నాటి నుండి పేద ప్రజల కోసం ఎం ఐ ఎం పార్టీ ఆధ్వర్యంలో పలు రకాలుగా సహాయ సహకారాలు అందుతూనే ఉన్నాయి. కొద్ధి రోజులుగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా మంగళ వారం బహదూర్ పుర నియోజక వర్గం పరిధి లోని దూద్ బౌలి డివిజన్ లో గల సాలార్ ఏ మిల్లత్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ రోజు పేద ప్రజలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు.
మజ్లిస్ పార్టీ అధినేత,హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిష్టర్ అసదుద్దీన్ ఆదేశాల మేరకు ఈ రోజు సుమారు 200 కుటుంబాలకు బహదూర్ పుర నియోజక వర్గం పరిధిలో నిత్యావసరాల కిట్ల పంపిణీ జరిగింది. బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ మోజం ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎం. ఏ. గఫార్ పాల్గొని పేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు.