పాట్నాఆగష్టు 1 (ఇయ్యాల తెలంగాణ ): కుల ప్రాతిపదికన సర్వే నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు లో భారీ ఊరట లభించింది. కుల ప్రాతిపదికన సర్వే నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన ఐదు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను మంగళవారం తోసిపుచ్చింది. దీంతో కుల ప్రాతిపదికన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించవచ్చు.వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఈ సర్వేను నిరోధించాలని పిటిషనర్లు కోరారు. వీటిని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ పార్థసారథి ధర్మాసనం తెలిపింది. జూలై 7న రిజర్వు చేసిన తీర్పును మంగళవారం వెల్లడిరచింది.బిహార్ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ, 80 శాతం సర్వే పూర్తయిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కుటుంబాల గణన జనవరి 7న ప్రారంభమై, జనవరి 21న ముగిసిందని తెలిపింది. రెండో దశ సర్వే ఏప్రిల్ 15న ప్రారంభమైందని తెలిపింది. ప్రజల కులం, వారి సాంఘిక`ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ 2023 మే నెలలో పూర్తికావలసి ఉందని పేర్కొంది.