నెల్లూరు ఆగష్టు 19 (ఇయ్యాల తెలంగాణ ); నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ వడారుపల్లి పార్కులో శనివారం నా భూమి`నా దేశంకార్యక్రమాన్ని నిర్వహించారు. నా భూమి` నాదేశం కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్చార్జి అదాల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. పడారుపల్లి పార్కులో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నా భూమి`నా దేశం కార్యక్రమంలో భాగంగా నేల తల్లికి నమస్కారం` వీరులకు వందనంకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత దేశ రక్షణ వ్యవస్థలో సైనికులుగా దేశ రక్షణ కోసం సేవలందించిన పలువురు మాజీ సైనికులను ముఖ్య అతిథిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్కు ఆవరణంలో నా భూమి ` నా దేశం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అదే ప్రాంతంలో జాతీయ జెండాను ఎంపీ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.
- Homepage
- General News
- నా భూమి` నా దేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఆదాల.
నా భూమి` నా దేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఆదాల.
Leave a Comment