నవోదయ స్కూలులో ఫుడ్‌ పాయిజన్‌

ఏలూరు ఆగష్టు 5,(ఇయ్యాల తెలంగాణ );ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామం   నవోదయ విద్యాలయం లో  ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో 

42 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురి అయ్యారు.  సమాచారం తెలుసుకున్న దెందులూరు శాసన సభ్యుడు కొఠారి అబ్బాయి చౌదరి పెదవేగి తహసీల్దార్‌, మండల మేజిస్ట్రేట్‌ నల్లమెల్లి నాగరాజు పోలీస్‌ అధికారులు వివిధ శాఖల అధికారులు హుటాహుటిన పెదవేగి నవోదయ విద్యాలయ కు చేరుకున్నారు. ఈ నెల 3వ తేదీన  ఈ పాఠశాలలో అంతర్రాష్ట్ర నవోదయ విద్యాలయాల విద్యార్థులకు జరిగే క్రీడల పోటీలలో పాల్గొనేందుకు కేరళ, కర్ణాటక, తదితర రాష్ట్రాలనుండి పెదవేగి నవోదయ పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యం క్రీడాకారులకు గురువారం రాత్రి చికెన్‌ కర్రితో భోజనం శుక్రవారం ఉదయం వెజ్‌ బిర్యానీ పెట్టారు.ఈ రెండు  ఆహార పదార్థాలలో ఎక్కడ తేడా జరిగిందో మరి ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అస్వస్థత పాలవడం తో పాఠశాల యాజమాన్యం దెందులూరు ఎం ఎల్‌ ఏ అబ్బయ్య చౌదరి, వివిధ శాఖల అధికారులు వారి ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తహసీల్దార్‌ ఎన్‌ నాగరాజు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....