హైదరాబాద్ అక్టోబర్ 5 (ఇయ్యల తెలంగాణ ):బుధవారం రాత్రి పురానాపూల్ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్ పోలీసులకు ఓ ద్విచక్ర వాహనదారుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని ఆపి వాహనాన్నిసోదాలు చేసారు. అతని వద్ద నుండి 18 లక్షల రూపాయల నగదు లభ్యమయ్యాయి. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు రోహిత్ అనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను హవిూదుల్లా ఖాన్ అనే వ్యక్తి కోసం కలెక్షన్ ఏజెంట్గా పని చేస్తున్నట్లు వెల్లడయ్యింది.లెక్కలేని మరో 17 లక్షల 50 వేల రూపాయలు ముషీరాబాద్ లోని స్క్రాప్ దుకాణంలో ఉన్నట్లు సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మొత్తం 35 లక్షల 50 వేల రూపాయల లెక్కలేని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ వెల్లడిరచారు.
- Homepage
- Charminar Zone
- నగదు స్వాధీనం
నగదు స్వాధీనం
Leave a Comment
Related Post