నకిలీ RPF ఎస్సై అరెస్టు

సికింద్రాబాద్‌, మార్చి 19 (ఇయ్యాల తెలంగాణ) : నకిలీ  అర్పిఎఫ్‌ మహిళా ఎస్సైని జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు.  నల్గొండ జిల్లా  నార్కట్‌ పల్లి కి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసింది. 2018 లో అర్‌ పి.ఎఫ్‌ ఎస్సై పరీక్ష రాసిన మాళవిక దాదాపు అన్ని అర్హతలు సాధించింది.    కానీ మెడికల్‌ చెకప్‌ లో దృష్టి లోపం కారణంగా తిరస్కరణకు గురైంది. అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్‌ ఐ అవుతున్నట్లు చెప్పుకుంది.

తన పరువు పోతుందని భావించిన మాళవిక ఎస్‌ఐ యూనిఫాం కుట్టించుకోవడంతో పాటు, నకిలీ ఐడి కార్డ్‌ చేయించుకుంది.  నార్కట్‌ పల్లి గ్రామంలో ఎస్సైగా చెలామణి అయింది మాళవిక. శంకర్‌ పల్లి లో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫాం లోనే వెళ్లింది. యూనిఫాం లోనే వీఐపి దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడం చేసింది. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు  పై అధికారులను సంప్రదించగా మోసం బయటపడిరది. తల్లి తండ్రులు భాద పడుతుండడంతో ఆమె ఇలాంటి పని చేసినట్లు తెలిపింది. ఇన్స్తాగ్రాం లో అర్‌ పి ఎఫ్‌ యూనిఫాం లో రీల్స్‌ చేసిన మాళవిక.గత ఏడాదిగా నకిలీ ఎస్సై గా  ఆమె చెలామణి అవుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....