ఖమ్మం, జూన్ 08 (ఇయ్యాల తెలంగాణ) : పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు, పోలీస్ అధికారులందరితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు మాట్లాడుతు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు కొనుగోలు చేస్తే ఆర్థికంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయ్యే ప్రమాదం వుంటుంది కాబట్టి నకిలీ విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. వ్యవసాయ అధికారులు విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారని, కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకొవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా విత్తనాల కొరత లేదనే విషయాన్ని రైతులకు భరోసా కల్పిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించేలా పకడ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి, తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారిపై గ్రామాల్లో సైతం నిఘా పెట్టామని తెలిపారు. ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇప్పటికే అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో ఏడు చెక్ పోస్ట్ ల ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు.
డీలర్లు, ఫెర్టిలైజర్ షాపు యజమానులు రైతులకు నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రయించి, రైతులకు నష్టం కలిగేలా వ్యవహరించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. రైతులు సైతం విత్తనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తత పాటిస్తూ, కొనుగోలు రశీదు తీసుకోవాలని సూచించారు.
మార్కెట్ లో టాస్క్ ఫోర్స్ బృందాల నిరంతరం పర్యవేక్షణ వుండాలని పెర్కొన్నారు. అలాగే తనిఖీల సమయంలో వీడియోగ్రాఫీ చేయడం ద్వారా ఎవిడెన్స్, అధారంగా వుంటుందని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే మండల వ్యవసాయ శాఖ అధికారికి గాని స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈసమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, ఏడిఏలు శ్రీనివాస్ ,నరసింహారావు,విజయచందర్,కరుణశ్రీ,శ్రీనివాస్ రెడ్డి, ఏవో కిషోర్, సిఐ స్వామి పాల్గొన్నారు.