నందమూరి బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’ అక్టోబర్‌ 19న విడుదల

ఇయ్యాల సినిమా జులై 22,(ఇయ్యాల తెలంగాణ ):గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘భగవంత్‌ కేసరి’ దసరా సెలవుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మేకర్స్‌ అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేసినట్లుగా ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం రిలీజ్‌, లాంగ్‌ దసరా హాలీడేస్‌ సినిమాకు బిగ్‌ అడ్వాంటేజ్‌.రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో బాలకృష్ణ నడిచే వాల్కనో లా వున్నారు.  రెండు చేతుల్లో రెండు గన్స్‌ తో ఫెరోషియస్‌ గా నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించారు. యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో హై యాక్షన్‌ ఉంటుంది. అనిల్‌ రావిపూడి మార్క్‌ మంచి వినోదం, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.భగవంత్‌ కేసరిలో కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్‌ తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్‌, రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్‌ రాంపాల్‌, కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....