‘‘ధూం ధాం’’ Movie నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘మాయా సుందరి..’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘‘ధూం ధాం’’. సాయి కుమార్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీరాజ్‌, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ‘‘ధూం ధాం’’ సినిమాను లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా దర్శకుడు సాయి కిషోర్‌ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్‌ స్టోరీ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రెడీ అవుతోంది.

’’ధూం ధాం’’ సినిమా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ సక్సెస్‌ ఫుల్‌ గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’ పాట ఛాట్‌ బస్టర్‌ అయ్యింది. మంగ్లీ పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయ్యింది. తాజాగా ‘‘ధూం ధాం’’ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘మాయా సుందరి..’ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించగా..గోపీ సుందర్‌ మంచి బీట్‌ తో కంపోజ్‌ చేశారు. అనురాగ్‌ కులకర్ణి పాడారు. ‘మాయా సుందరి..హే మాయా సుందరి..నా మాయా సుందరి..ఎక్కడున్నావో మరి..గుప్పెడు గుండెను నువ్వే పట్టుకుపోయావే, నా రెప్పల నిద్దురనంతా ఎత్తుకుపోయావే..’ అంటూ సాగుతుందీ పాట. హీరో పాడుకునే లవ్‌ సాంగ్‌ గా ‘మాయా సుందరి..’ పాటను స్టైలిష్‌ గా రూపొందించారు.

నటీనటులు ` చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌, సాయి కుమార్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీరాజ్‌, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, నవీన్‌ నేని, గిరిధర్‌, భద్రమ్‌ తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....