దొంగపెళ్లిళ్ల పాస్టర్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(ఇయ్యాల తెలంగాణ): ఉప్పల్‌లోని గాస్పల్‌ చర్చిలో కీచక పాస్టర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాస్టర్‌ ముసుగులో అమ్మాయిలకు గాలం వేసి లోబర్చుకుంటున్న పాస్టర్‌ కటకటాలపాయ్యాడు. ఇప్పటి వరకు పాస్టర్‌ జోసఫ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మత ప్రభోధకుడి ముసుగులో ఆడపిల్లలను ట్రాప్‌ చేస్తూ మోసగిస్తున్నాడు. పాస్టర్‌ లైంగిక దాడిచేసి, బెదిరింపులకు పాల్పతున్నాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పాస్టర్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....