దేశీయ విమానాలకు రెక్కలు
25 నుంచి ఆకాశంలోకి దేశీయ విమానాలు
అనుమతులు ఇస్తూ విమానయాన శాఖ నిర్ణయం న్యూఢిల్లీ ,మే20(ఇయ్యాల తెలంగాణ ): దేశీయ విమానాలకు రెక్కలు వచ్చాయి. 25 నుంచి మళ్లీ ఆకాశంలోకి ఎగురనున్నాయి. ఎక్కడివారు అక్కడే ఉండిపోయిన వారంతా ఇక మల్లీ ఫ్లైట్లు ఎక్కనున్నారు. ఈ మేరకు కేంద్రీయ విమానయానశాఖ ఆదేశాలు ఇచ్చింది. దేశీయ విమానాలను నడుపుకునేలా కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఈనెల 25 నుంచి దేశీయ పౌర విమాన సర్వీసులు విడత వారీగా ప్రారంభంకానున్నాయి. విమాన కార్యకలాపాలకు సిద్ధంగా ఉండాలని అన్ని ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్టులకు పౌర విమానయానశాఖ సూచించింది.
న్యూఢిల్లీ ,మే20(ఇయ్యాల తెలంగాణ ): దేశీయ విమానాలకు రెక్కలు వచ్చాయి. 25 నుంచి మళ్లీ ఆకాశంలోకి ఎగురనున్నాయి. ఎక్కడివారు అక్కడే ఉండిపోయిన వారంతా ఇక మల్లీ ఫ్లైట్లు ఎక్కనున్నారు. ఈ మేరకు కేంద్రీయ విమానయానశాఖ ఆదేశాలు ఇచ్చింది. దేశీయ విమానాలను నడుపుకునేలా కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఈనెల 25 నుంచి దేశీయ పౌర విమాన సర్వీసులు విడత వారీగా ప్రారంభంకానున్నాయి. విమాన కార్యకలాపాలకు సిద్ధంగా ఉండాలని అన్ని ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్టులకు పౌర విమానయానశాఖ సూచించింది.
ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రయాణికుల భద్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై పౌర విమానయాన శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తుందని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా గత మార్చిలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రతి విమానంలో పరిమిత స్థాయిలో ప్రయాణికులను అనుమతించనున్నారు. భౌతిక దూరం తప్పకుండా పాటించేలా సీట్లను కేటాయించనున్నారు. అలాగే పూర్తిస్థాయి శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.