దేశవ్యాప్తంగా గవర్నర్ల మార్పుకు రంగం సిద్ధం ! Telangana కు అశ్వినీ కుమార్‌ చౌబే


తెలంగాణకు అశ్వినీ కుమార్‌ చౌబే, కర్నాటకకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి?!

న్యూఢిల్లీ, జూన్‌ 17 (ఇయ్యాల తెలంగాణ) :  జాతీయ రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడానికి రంగం సిద్ధమయింది. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మార్పులు చేర్పులు చేయబోతోంది.ప్రస్తుతం తెలంగాణకు ఉన్న ఇన్‌ ఛార్జీ గవర్నర్‌ సిపి. రాధాకృష్ణన్‌ పాండిచ్చేరి, జార్ఖండ్‌  గవర్నర్‌ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు మాజీ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే గవర్నర్‌ కాబోతున్నట్లు సమాచారం. ఇదిలావుండగా తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బిజెపి పావులు కదుపుతోందని తెలుస్తోంది. 

మోడీకి అత్యంత నమ్మకస్తుడైన అశ్వినీ కుమార్‌ చౌబేను తెలంగాణ గవర్నర్‌ గా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కలిసివున్నప్పుడు (ఉమ్మడి ఏపి) ముఖ్యమంత్రిగా పనిచేసిన బిజెపి నాయకుడు కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కర్నాటక రాష్ట్రానికి గవర్నర్‌ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....