దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు, మొదటి F I R నమోదు

న్యూఢల్లీ జూలై 1(ఇయ్యాల తెలంగాణ ): బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌(సీఆర్‌పీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌) చట్టాలను తీసుకువచ్చారు. ఈ క్రమంలో కొత్త చట్టాల కింద తొలి కేసు నమోదయింది. అదికూడా దేశ రాజధానిలోనే  కావడం గమనార్హం.న్యూఢల్లీి రైల్వే స్టేషన్‌ సవిూపంలో ఓ చిరు వ్యాపారిపై   గత అర్ధరాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ వ్యాపారి రోడ్డు విూద గుట్కా, వాటర్‌ బాటిల్స్‌ అమ్ముతూ వారికి కనిపించాడు. దీంతో దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉన్నదని, దానిని తీసేయాలని ఆ వ్యాపారికి చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినకపోవడంతో భారతీయ న్యాయ సంహిత క్రిమినల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 285 ప్రకారం.. కమలా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదుచేసినట్లు పోలీఉలు తెలిపారు. నిందితుడిని బీహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్‌ కుమార్‌గా గుర్తించారు. ఈ సెక్షన్‌ ప్రకారం.. రోడ్లను ఆక్రమించడం, తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. జరిమానా రూ.5 వేల వరకు ఉంటుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....