దేశమంతా విస్తరించిన రుతుపవనాలు

హైదరాబాద్‌, జూలై 3, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ మరియు నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుండి వస్తున్నాయి.ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ  కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థిరమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. విూ. వేగంతో వీచే అవకాశం ఉంది.హైదరాబాద్‌ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు (30 నుంచి 40 కిలో విూటర్లు) వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 10 ` 14 కిలో విూటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదైంది. 77 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు జూలై 8 నాటికి విస్తరించాల్సి ఉండగా.. ఈ ఏడాది మాత్రం భిన్నంగా జూలై 2నాటికే విస్తరించాయని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏపీ, యానాం విూదుగా దిగువ ట్రోపోస్ఫిరిక్‌ నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపారు.అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలో విూటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో విూటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.రాయలసీమలోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలో విూటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....