అమరావతి జూలై 4,(ఇయ్యాల తెలంగాణ ); దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం దేవాదాయ చట్టం సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ చట్టం సెక్షన్ 83లో మార్పులు చేర్పులతో దేవాలయ ఆస్తుల పరిరక్షణ జరుగుతుందన్నారు. దేవాలయాల భూములు ఆక్రమణలను అడ్డుకోవడం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సీసీఎల్‌ఏ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన కమిటీలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 4.53 లక్షల ఎకరాల దేవాలయాల భూములు ఉన్నాయని.. దేవాలయాల భుములంటే కొందరికి ఎండోమెంట్ పోరం బోకు భూములు అన్న అభిప్రాయం ఉందన్నారు. దుర్గగుడిలో ఈవో, పాలక వర్గం మధ్య వివాదాలు ఏవిూ లేవని స్పష్టం చేశారు. పాలక మండలి తన పరిధి తెలుసుకోవాలని సూచించారు. వారి విధులు బాధ్యతలపై త్వరలోనే అవగాహన కల్పిస్తామని మంత్రి కొట్టు సత్యానారాయణ పేర్కొన్నారు.