దేవయ్య మృతి తీరని లోటు – బండి నరేష్
హైదరాబాద్ మే 15 : ( ఇయ్యాల తెలంగాణ )
తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఉన్నతికి అహర్నిశలు కృషి చేసిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ సభ్యులు సుంకపాక దేవయ్య మరణం దళిత జాతికి తీరని లోటని పలువురు దళిత సంఘాల నాయకులు విచారం వ్యక్తం చేశారు. దళితుల కోసం పోరాటం చేసిన ఒక నాయకుడు నేల కొరిగాడని ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం అయన నివాసంలో పలువురు నాయకులూ అయన భౌతిక కాయాన్ని దర్శించుకొని నివాళులు అర్పించారు. ఈ మేరకు పాత నగరం నుంచి జాతీయ ఎం ఆర్ పి ఎస్ ఉపాధ్యక్షులు బండి నరేష్ రామ్ నగర్ లోని నివాసంలో సుంకపాక దేవయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బండి నరేష్ మాట్లాడుతూ దేవయ్య మాదిగ చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు.