దృశ్యం, విరాటపర్వం రిలీజ్‌పై సందిగ్ధం

విక్టరీ వెంకటేష్‌ నటించిన ’నారప్ప’ ఇటీవల ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్‌ స్థాయిలో కాకపోయినా మంచి సక్సెస్‌ అయితే దక్కించుకుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ వారికి అది ప్రాఫిటబుల్‌ వెంచరే అయింది. అయితే సురేష్‌ బాబు చేతిలో ఇప్పుడు మరో రెండు సినిమాలు విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నాయి. ఆ సినిమాలు వెంకీ ’దృశ్యం 2’, రానా ’విరాటపర్వం’. అయితే ఇప్పుడీ రెండు సినిమాల్ని థియేటర్స్‌ లో విడుదల చేయాలా? లేక ఓటీటీలో విడుదల చేయాలా అనే సందిగ్ధతతో సురేశ్‌ బాబు ఉన్నారని తెలుస్తోంది. నిజానికి ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్‌ రైట్స్‌ కోసం డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వారు మంచి రేట్‌ ఆఫర్‌ చేశారట. ఒకదశలో సురేశ్‌ బాబు ఆ ఆఫర్‌ కు ఓకే చెప్పాలనుకున్నారట. కానీ ఆయన ఆలోచనలో పడ్డారట. రెండు సినిమాల్నీ థియేటర్స్‌ లోనే విడుదల చేస్తే బాగుంటుందని అనుకున్నారట. అయితే ఈ రెండు సినిమాల్ని ఏ డేట్‌ లో విడుదల చేయాలని అనే కన్ఫ్యూజన్‌ లో ఉన్నారు. పెద్ద హీరోలు, విూడియమ్‌ రేంజ్‌ హీరోల సినిమాలన్నీ వరుసగా విడుదల తేదీలు ఫిక్స్‌ చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలకి సరైన రిలీజ్‌ డేట్‌ కుదరడంలేదు. అసలు కంటెంట్‌ లో దమ్ముంటే.. సినిమాను ఎప్పుడు ఎక్కడ విడుదల చేసినా తిరుగుండదు. మరి సురేశ్‌ బాబు కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌ అయిన ’దృశ్యం 2, విరాటపర్వం’ సినిమాల్ని ఏ ప్లాట్‌ ఫామ్స్‌ లో విడుదల చేస్తారో చూడాలి. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....