విజయవాడ జులై 14, (ఇయ్యాల తెలంగాణ ): ఇంద్రకీలాద్రి అమ్మవారిని బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం దర్శించుకున్నారు. ఆమె సకుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేదపండితులు దంపతులకు వేదాశీర్వచనం చేసారు. తరువాత ఆలయ అధికారులు, పండితులు అమ్మవారి ప్రసాదం అందించారు.