దుర్గమ్మను దర్శించుకున్న TELANGANA మంత్రులు

విజయవాడ జులై 09 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,  ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి  దుదిల్ల శ్రీధర్‌ బాబు, సిడబ్ల్యుసి సభ్యులు రుద్రరాజు తదితరులు మంగళవారం నాడు విజయవాడ కనుకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.వారికి  కనుకదుర్గ ఆలయం వద్ద ఆలయ ఈవో మరియు జిల్లా రెవిన్యూ అధికారి, జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు . ఆలయంలో ఆలయ  అర్చకులు మల్లయ్య శాస్త్రి, మరియు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అమ్మవారి గర్భగుడిలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం విలసిల్లాలని ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు.భట్టి విక్రమార్క స్పీచ్‌ మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వ పాలనలో సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సమగ్ర అభివృద్ధి చేయడానికి అమ్మవారు ఆశీర్వదించాలని వేడుకున్నాను. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండే విధంగా అమ్మవారి దీవించాలని కోరాను. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని కనుకదుర్గ అమ్మవారిని వేడుకున్నానని వెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....