త్యాగానికి ప్రతీక బక్రీద్‌ – మసీదులలో ఘనంగా బక్రీద్‌ వేడుకలు

రాజమహేంద్రవరం, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : త్యాగానికి ప్రతీక పవిత్ర బక్రీదు పండుగ అని నెహ్రూ నగర్‌ ఈద్గా కమిటీ గౌరవ అధ్యక్షులు కరీం ఖాన్‌, జాంపేట లాభం లైన్‌ మసీద్‌ అధ్యక్షులు, ముస్లిం జేఏసీ కన్వీనర్‌ హబీబుల్లా ఖాన్‌ పేర్కొన్నారు. గురువారం బక్రీద్‌ పండుగ సందర్భంగా నెహ్రూ నగర్‌ ఈద్గా దర్గాలోను, జాంపేట లాబబిన్‌ లైన్‌ మసీదులోనూ ముస్లిం సోదరులు ఉపవాసంతో నమాజ్‌ కార్యక్రమం నిర్వహించారు. నమాజ్‌ కార్యక్రమం అనంతరం కరీం ఖాన్‌ అబీబుల్లాఖాన్‌ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు బక్రీద్‌ పండుగ అతి పవిత్రమైనదని అన్నారు. ఇబ్రహీం సలీమ్‌ తన కుమారుడిని బలి యాగం చేసే సమయంలో జరిగిన అద్భుతం తో గొర్రె పిల్లను బలిగా ఇస్తారని దీనిని బక్రీదుగా ముస్లిం సోదరులు జరుపుకుంటారని తెలిపారు.ఈ పండుగ త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఉన్నవారు పేదవారికి దానధర్మాలతో ఆదరిస్తారని తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ సోదరులు శాంతి సహనంతో దేశంలో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెహ్రు నగర్‌ ఈద్గా కమిటీ అధ్యక్షులు ఎండి అమానుల్లా ఖాన్‌ బేగ్‌, ఉపాధ్యక్షులు యండి ఆరిఫ్ద్దీన్‌, ఎండి జలీల్‌, ఎండి అన్వర్‌, సెక్రటరీ ఎండి షబీర్‌, ఎండి సయ్యద్‌ ఎండి ఖుదూష్‌, ఎస్కే ఆలీ, జాంపేట లావా బీన్‌ మసీదు నాయకులు బాషా, సయ్యద్‌ బాబులు, సయ్యద్‌ రబ్బాని, కరీం  ఖురేషి, హుదూద్‌ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....