తొలి ఏకాదశి రోజున శ్రీ రంగనాథస్వామి Temple లొ ప్రత్యేక పూజలు…

మద్దికేర, జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) : మద్దికేర మండలం పెరవలి గ్రామంలొ వెలసిన శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథస్వామి ఆలయంలొ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహనాధికారి చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు.మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు కోమండూరి రంగనాథాచార్యులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం తొలి ఏకాదశి ఆషాడ శుద్ధ ఏకాదశి పండుగ సందర్భంగా వేకువ రaామున శ్రీభూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథస్వామి మూలమూర్తులకు పంచాంభృత అభిషేకాదులు నిర్వహించి, నూతన పట్టువస్త్రాలు ధరింపజేసి, దివ్యాభరణాలతోను,వివిధ రకాల పూలమాలలతోను సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు పూజలు నిర్వహిస్తారని తెలిపారు.ఉదయం 9 గంటలకు శ్రీభూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథస్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకోని ఆలయ ఆవరణలోని మండపంలోకి తీసుకువచ్చి తిరుమంజనోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. తిరుమంజనోత్సవ కార్యక్రమంలొ పాల్గొనేవారు ఉభయదాతలకి 350 రూపాయలు చెల్లించి గోత్రనామాలతో పూజలు జరిపించుకొనవచ్చని తెలిపారు.సాయంత్రం ఐదు గంటలకు స్వామి వారికి శేషశయన అలంకరణ ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు.కావున భక్తాదులందరు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని,తీర్త ప్రసాదములు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....