తెలంగాణ రాష్ట్రం వైపు తరలి వస్తున్న మిడతల దండు – అప్రమత్తంగా ఉండాలని అధికారులతో కేసీఆర్ సమీక్ష


      8జిల్లాలు అప్రమత్తంగా ఉండాలన్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ ): రాష్ట్రానికి  మిడతల  దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఆదేశించారు. మిడతల  దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు  చేపట్టినట్లు సీఎం పేర్కొన్నారు. మిడతల  దండు నుంచి కాపాడే చర్యలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. మిడతల  దండు గమనంపై సమాచారాన్ని తెప్పించుకొన్న సీఎం అధికారులతో చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అలర్ట్‌గా ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి చర్యలు  తీసుకోవాలి.  మిడతల దండు దాడి చేసిందంటే చాలా నష్టం. లేత పంటలను పీల్చి పారేస్తుంది..ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల  దండు ప్రవేశించకుండా చర్యలు  తీసుకోవాని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. గత నెలలో మూడు విడతలుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వరకు మిడతలు  వచ్చాయి. తెలంగాణ వైపు మిడతలు  రాలేదు.  తాజాగా ఓ మిడతల  దండు తెలంగాణ సవిూపంలోకి వచ్చింది. రాష్ట్రానికి 200 కిలోవిూటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్‌ దగ్గర అజ్ని అనే గ్రామం దగ్గర ప్రస్తుతం మిడతల  దండు ఉంది. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని  సీఎం వివరించారు. ఈ నెల  20 నుంచి జూలై 5 వరకు మిడతలు  వచ్చే అవకాశం ఉన్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల సరిహద్దులోని 8 జిల్లాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. . భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరు నాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటా, ధర్మాబాద్‌, బోధన్‌, జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాల నుంచి మిడతల  దండు వచ్చే ప్రమాదం ఉందన్నారు. మళ్లీ మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు  తేల్చినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో పంటలు  మొలకెత్తి ఉంటాయని, మిడతల  దండు దాడి చేసిందంటే చాలా నష్టం జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలోకి మిడతల  దండు ప్రవేశించకుండా చర్యలు  తీసుకోవాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....