హైదరాబాద్, మార్చి 5 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో రాష్ట్రంలో కొత్త రాజకీయాలు అవసరమని తెలంగాణ జన సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి దర్మార్జున్ పేర్కొన్నారు. శుక్రవారం నాంపల్లి టీజేఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరామ్ అభ్యర్థిత్వాన్ని, ప్రతి పాదిస్తూ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ సమర్పణ జరిగింది. తెలంగాణ జన సమితి పార్టీ రెండవ రాష్ట్ర ప్లీనరీ సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ నియమాల మేరకు పార్టీ అధ్యక్షుని ప్రజాస్వామిక ఎన్నిక ప్రక్రియను ఎన్నికల అధికారిగా ఎస్ సత్య నారాయణ భాద్యతలు నిర్వహించారు. ప్రొఫెసర్ కోదండరామ్ కి మద్దతుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి గంగపురం వెంకటరెడ్డి ఒక సెట్ ను సమర్పించారు. మరో నామినేషన్ పత్రాల సెట్ ను పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, పల్లె వినయ్ కుమార్ లు సమర్పించినట్లు టీజేఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ బద్రోద్దిన్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భైరి రమేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసీన టీజేఎస్ పార్టీ రాష్ట్రంలో మంచి గుర్తింపు సాదించిందన్నారు. రానున్న రోజుల్లో టీజేఎస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్చార్జ్ నిజ్జన రమేష్,, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు సయ్యద్ సలీంపాషా, విద్యార్ధి రాష్ట్ర అధ్యక్షుడు బాబూ మహాజన్, లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, రాష్ట్ర విద్యార్ది ప్రధాన కార్యదర్శి మాసంపల్లీ అరుణ్ కుమార్, రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ కొత్త రవి, రాష్ట్ర యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర వీరన్న, రాష్ట్ర విద్యార్ది ఉపాధ్యక్షుడు పేరాల పారశాంత్, విద్యార్ధి రాష్ట్ర కార్యదర్శి నకీరేకంటి నరేంధర్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టల రాంచందర్, మహాబుబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ రెడ్డి, విద్యార్ధి నాయకులు జీవన్, పవన్ గోపి తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- General News
- తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు అవసరం
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు అవసరం
Leave a Comment