నల్లగొండ, మార్చి 26 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రజలు రాజన్న పాలన కోరుకుంటున్నా రని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం లో బాగంగా 36వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మొత్కుర్ మండల కొండగడప గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుండి పాటిమట్ల, అడ్డగూడూర్ దాచారం వరకు యాత్ర కొనసాగింది. దాచారం గ్రామంలో షర్మిల కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు కోలాట న్రృత్యాలతో షర్మిల కు స్వాగతం పలికారు. దాచారంలోని జ్యోతి రావ్ పూలే, అంబేద్కర్ విగ్రహాలకి పూల మాలలు వేసి నివాళులు సమర్పించారు షర్మిల బ్రృందం. అక్కడ ప్రజలతో కలిసి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం డి, రేపాక మంగమ్మ గూడెం మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా అధినేత్రి వైఎస్ షర్మిల మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ లు ఒకే తాన్ ముక్కలని, వేరే కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరిచేలా నిత్యావసర ధరలు పేంచుకుంటు ఒకరిపై మరొకరు ధరలు దించాలని ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందంన్నారు. ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలను పసిగడుతున్నారని అన్నారు. రాష్ట్ర పాలన కూడా చాలా తమాషాగా ఉందని అన్నారు. వైఎస్సార్ పాలనలో మహిళలు స్వయం ఉపాధి కోసం లోన్లు తిసుకుంటే, కేసీఆర్ పాలనలో మహిళలు అప్పులు తీర్చడానికి లోన్లు తిసుకుంటు న్నారని అన్నారు. ఐదు ఆరు చదివిన వాళ్ళు రాష్ట్ర మంత్రి పదవులు అనుభవించవచ్చు కానీ, డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళు బర్రెలను, గొర్రెలను కాయాలా? అని ప్రశ్నించారు. తన పాదయాత్రలో ఎక్కడ చూసినా కేసీఆర్ కీ వ్యతిరేకత ఉందని, ప్రజలు రాజన్న పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, వాడుక రాజగోపాల్, చైతన్య రెడ్డి, నీలం రమేష్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- General News
- తెలంగాణ ప్రజలు రాజన్న పాలన కోరుకుంటున్నారు : వైఎస్ షర్మిల
తెలంగాణ ప్రజలు రాజన్న పాలన కోరుకుంటున్నారు : వైఎస్ షర్మిల
Leave a Comment