తెలంగాణా సంక్షేమమే కేసీఆర్ ఆశయం పుస్తె శ్రీకాంత్

హైదరాబాద్,ఫిబ్రవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణా సంక్షేమమే ముఖ్య మంత్రి కేసీఆర్ ఆశయమని హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ పుస్తే శ్రీ కాంత్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురాణాపుల్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పుస్తే శ్రీకాంత్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన దళిత బంధు పధకాన్ని తమ పార్లమెంట్ నియోజకవర్గం లో అర్హులైన వారికి అందే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం లాంగ్ లీవ్, లాంగ్ లీవ్ కేసీఆర్ అంటు నినాదాలు చేస్తూ జయంతి ఉత్సవాలను సంబరంగా నిర్వహించారు. కార్యక్రమం లో మొగల్ పురా డివిజన్ అధ్యక్షుడు రాధాకృష్ణ, గోపియాదవ్, గోపిగౌడ్, విష్ణు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....