తెలంగాణలో పాఠశాలలకు సెలవు!

  

హైదరాబాద్‌, జూన్‌ 26, (ఇయ్యాల తెలంగాణ):తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పాఠశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి సంఘం (ఏబీవీపీ) ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు, కార్పొరేట్‌ శక్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ‘మన ఊరు మన బడి’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామనన్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైందన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫారాలు ఇంకా అందలేదన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు, డొనేషన్లు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల రaాన్సీ తెలిపారు.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ, ఎంఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో సరైన ఫీజుల అమలుకు ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ రోజు జరిగే రాష్ట్ర వ్యాప్త పాఠశాలల సమ్మెకు విద్యార్థులు, తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....