హైదరాబాద్, జూలై 6, (ఇయ్యాల తెలంగాణ ):వచ్చే అసెంబ్లీ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఈసారి రాష్ట్రంలో ఉనికి చాటుకోకుంటే? ఇక దుకాణం కట్టేసుకోవాల్సిందేనన్నంత కసి, భయం కలగలిసి ఉన్నాయట ఆ పార్టీ నేతల్లో. రాష్ట్ర నాయకుల సంగతి పక్కన పెడితే? అధిష్టానమే ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. అంతర్గత కుమ్ములాటలతో ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకూడదన్న పట్టుదలగా వ్యూహ రచన జరుగుతోందట. పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోకూడదనుకుంటూ? నౌ ఆర్ నెవర్ అంటున్నారట పార్టీ పెద్దలు. అందుకనే? సోనియా, రాహుల్, ప్రియాంక.. ఇలా అంతా ఇప్పుడు తెలంగాణ విూద ఫోకస్ పెట్టారట. మరీ ముఖ్యంగా పొలిటికల్ వీఆర్‌ఎస్ తీసుకున్న సోనియా కూడా ఈ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉన్నట్టు తెలిసింది. ఖమ్మం బహిరంగ సభ జరిగిన రోజున ఆమె వ్యవహారశైలి గురించి తర్వాత తెలుసుకున్న టి కాంగ్రెస్ నేతలు అవాక్కయ్యారట.ఖమ్మం సభ జరుగుతున్న తీరును సోనియా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ? స్వయంగా పర్యవేక్షించారట. సభ విూద పోలీసుల ఆంక్షలు, వచ్చేవారిపై నియంత్రణ గురించి తెలుసుకున్న సోనియాగాంధీ?. నాలుగైదు సార్లు రాహుల్ సెక్యూరిటీ అధికారుకి ఫోన్ చేసి ఆరా తీశారట. సభ దగ్గర ఎవరెవరు ఉన్నారు..? ఏం జరుగుతోంది? జన సవిూకరణ?లాంటి అంశాలపై ఆమె వాకబు చేసినట్టు తెలుసుకున్న కొంత మంది సీనియర్ నేతలు అవాక్కయ్యారట. మేడమే నేరుగా ఫోకస్ పెట్టడం ఏంటి? ఆ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారంటే?.అధిష్టానం ఎంత సీరియస్ గా తెలంగాణ విూద ఫోకస్ పెట్టిందో అర్థం అవుతోందంటున్నారు. అటు చేరికలపై కూడా నేరుగా అధిష్టానమే దృష్టిసారిస్తోంది. పార్టీ చేయించుకుంటున్న సర్వేల ఆధారంగానే చేరికల లెక్కలు ఉన్నట్టు తెలిసింది. ఎత్తుగడలకు సంబంధించిన ఆదేశాలన్నీ?.ఢల్లీి నుంచే వస్తున్నాయని అంటున్నారు. అంటే? ఎట్నుంచి ఎటు చూసినా? ఏ అవకాశాన్ని