తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఒంగోలుజులై 26, (ఇయ్యాల తెలంగాణ ):పోలాల్లోకి దూసుకుపోయిన ప్రైవేటు బస్సు

ప్రయాణికులు క్షేమం  ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఒక టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకువెళ్లింది. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం కొమరోలు సవిూపంలో ఘటన జరిగింది. బస్సు డ్రైవర్‌ అప్రమత్తం కావటంతో భారీ ప్రమాదం తప్పింది. పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భూపాల్‌ నగరానికి చెందిన టూరిస్ట్‌ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది ప్రయాణికులువున్నారు.  తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....