తుంగభద్ర జలాశయానికి పోటెత్తిన వరద

 

  ఈ నెల చివరి నాటికి తుంగభద్ర డ్యాం నిండే అవకాశం

అయిజ జూలై 26 (ఇయ్యాల తెలంగాణ ): కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఉత్తర, దక్షిణ కన్నడ ప్రాంతాల నుంచి తుంగభద్ర జలశయానికి లక్ష క్యూసెక్కుల వరద చేరుతోంది. బుధవారం డ్యాంలోకి 1,08,019 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో ఉండగా, అవుట్‌ ఫ్లో 198 క్యూసెక్కులు నమోదైంది.డ్యాంలో గరిష్ట నీటి నిల్వ 105.788 సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 40.136 టీఎంసీ నీటిమట్టం ఉంటుంది. డ్యామ్‌లో 1633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గానూ 1611.27 నీటిమట్టం ఉన్నట్లు డ్యామ్‌ సెక్షన్‌ అధికారి రాఘవేంద్రరావు తెలిపారు. ఎగువ నుంచి వరద మరింత పెరిగే సూచనలు ఉన్నాయని, ఈ నెల చివరి నాటికి తుంగభద్ర డ్యాం నిండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. టీబీ డ్యాంకు ఆశించిన మేరకు వరద చేరుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....