తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమంగలం

శ్రీకాకుళం జులై28, (ఇయ్యాల తెలంగాణ ):సంతబొమ్మాలి మండలం మేఘవరం పంచాయతీ పాత మేఘవరం, మరువాడ  పంచాయతీ డి.మరువాడ మధ్యన సముద్ర తీరానికి అరుదైన చేప బారీ చనిపోయిన నీలి త్రిమంగళం ( బ్లూ వేల్‌ ) గురువారం కొట్టికొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు. అయితే భూమిపై ఉన్న అత్యంత భారీ జాతులలో  ఇది ఒకటి. అయితే ఇది సుమారుగా 5 టన్నులు మాత్రమే ఉండడం వలన ఇది ఆ జాతి చేప పిల్లగా భావిస్తున్నారు.

ఈచేప ఒడ్డుకు చేరిందని  తెలియగానే అధిక సంఖ్యలో ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు ఈ   చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో  సముద్రతీరానికి తరలివచ్చారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....