తిరుపతి నూతన బస్టాండుకు ఈ నెలలోనే టెండర్లు

తిరుపతి జులై 14,(ఇయ్యాల తెలంగాణ ): తిరుపతిలో రూ.400 కోట్లతో 13 ఎకరాల్లో ఇంటర్‌ మోడల్‌ సెంట్రల్‌ బస్టేషన్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ సిద్ధం చేశామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీనికి గతేడాది ఆర్టీసీతో ఎంవోయూ జరిగిందని ఈ నెలలోనే టెండరు దశ పూర్తవుతుందన్నారు. కృష్ణ పట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారుల నిర్మాణానికి డిజిటల్‌ విధానంలో గురువారం ఉదయం తిరుపతి తారకరామా స్టేడియంలో శంకుస్థాపన చేశాక జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రేణిగుంట ` నా యుడుపేట మధ్య రూ.2300కోట్లతో జరుగుతున్న 6లేన్ల జాతీయ రహదారి పనులు వచ్చే ఏడాది జనవరికల్లా పూర్తవుతాయన్నారు. ఏపీలో 7 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణాలు చేపట్టగా బెంగుళూరు` చెన్నై, కోలారు జిల్లా బేతమంగళం`చిత్తూరు జిల్లా గుడిపాల, చిత్తూరు`చెన్నయ్‌ సవిూపంలోని తచ్చూరు మార్గాలు వీటిలో ప్రధానమైనవన్నారు. ప్రస్తుతం బెంగళూరు` చెన్నై ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటలుందని హైవే పూర్తయితే రెండున్నర గంటల్లో వెళ్లిపోవచ్చన్నారు. వివిధ దశల్లోని ఎన్‌హెచ్‌ పనుల ఫొటో ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు…!!

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....