తిరుపతిలో నలుగురు అమ్మాయిలు మిస్సింగ్‌

తిరుపతి, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ) : ఒకే రోజు నలుగురు అమ్మాయిల మిస్సింగ్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని వేరు వేరు ప్రాంతాల్లో అమ్మాయిలు కనబడకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయిల మిస్సింగ్‌ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన మౌనిక బుధవారం రాత్రి నుండి కనిపించడం లేదు. ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడంతో పాటు బంధువుల ఇంటికేమైనా పోయిందేమోనని కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇక చిత్తూరు పట్టణంలోనూ ఇలాగే మరో యువతి కనిపించకుండా పోయింది. చిత్తూరు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసముండే రితిక గురువారం నుండి కనిపించడం లేదు.

ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే చిత్తూరు జిల్లా వి.కోట ప్రాంతానికి చెందిన కోమల, పుంగనూరుకు చెందిన రaూన్సీ కూడా బుధవారం నుంచి కనిపించడం లేదు. ఇలా ఒకేరోజు నలుగురు అమ్మాయిలు మిస్సవడం అనేక అనుమానాలకు రేకెత్తిస్తోంది. అమ్మాయిలను ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేక అమ్మాయిలే ఎక్కడికైనా వెళ్ళారా? ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా? అన్న అనేక అనుమానాలు కలుగుతున్నాయి.బిడ్డలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఈ అమ్మాయిల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు అమ్మాయిల వివరాల పంపించి అలెర్ట్‌ చేశారు. నలుగురు అమ్మాయిలను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు  తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....