తాగిన మైకంలో విమాన ప్రయాణికుల హల్చల్‌

హైదరాబాద్‌ ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):తాగిన మైకంలో దోహా నుండి కొచ్చిన్‌ వెళుతున్న ఇండిగో విమానంలో నలుగురు ప్రయాణికులు హంగామా సృష్టించారు. ఎయిర్లైన్స్‌ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడంతో విమానాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండిరగ్‌ చేశారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన గురువారం నాడు చోటుచేసుకుంది. దోహా నుండి హైదరాబాద్‌ విూదుగా కొచ్చిన్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మద్యం సేవించి విమానం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో విసిగిపోయిన ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది శంషాబాద్‌ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని శంషాబాద్‌ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండిరగ్‌ చేశారు. ఈ మేరకు నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది శంషాబాద్‌ ఆర్‌ జి ఐ ఏ పోలీసులకు అప్పగించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై న్యూసెన్స్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విమానాశ్రయంలో సంచలనం సృష్టించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....