న్యూఢల్లీ జూన్, 30 ,(ఇయ్యాల తెలంగాణ ): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఢీ ల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో కలుపుగోలుగా ముచ్చటిస్తూ ఢీ ల్లీి విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఈ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఢీ ల్లీ మెట్రోలో ఆయన ప్రయాణికులతో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.ఢల్లీి మెట్రో రైలులో యువతీ, యువకులు, మహిళలతో మోదీ ఎంతో ఆత్మీయంగా, నవ్వుతూ ముచ్చటించారు. చాలా కాలం నుంచి పరిచయం ఉన్న స్నేహితులతో మాట్లాడినట్లుగా వీరి హావభావాలు కనిపించాయి.ఢల్లీ
విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో మోదీ ముఖ్య అతిథిగా, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ టెక్నాలజీ ఫ్యాకల్టీ, కంప్యూటర్ సెంటర్, అకడమిక్ బ్లాక్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసారు. కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరించారు.