హైదరాబాద్, మార్చి 20 (ఇయ్యాల తెలంగాణ) : బిసి ల సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తేచ్చి డిల్లీ వేదికగా బీసి ల సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతామని బీసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసులు సురేష్ ఆధ్వర్యంలో శనివారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన బిసి ముఖ్య నాయకుల సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా కేంద్రం పై ఒత్తిడి తెచ్చేలా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ నేత్రుత్వంలో డిల్లీ వేదికగా కార్యాచరణ నిర్వహించినట్లు తెలిపారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు, బీసీ కులగణన చేపట్టాలని, విద్యా, ఉన్నత ఉద్యోగాలలో 50శాతం రిజర్వేషన్ కల్పించాలని, ప్రత్యేక బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలని, బీసీ సబ్ ప్లాన్ అమలు పరచాలని, మండల కమీషన్ సిఫార్సులను క్షేత్ర స్థాయిలో అమలు అవ్వడానికి దోహదపడేలా బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికీ కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి చేసే విధంగా డీల్లీలో ప్రత్యేక కార్యాచరణ కోనసాగుతుందని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.
అనంతరం దాసూ సురేష్ మాట్లాడుతూ మార్చి 21నుండి మూడు వారాల పాటు డిల్లీ లో కొనసాగబోయే ఈ వ్యూహాత్మక కార్యచరణకు బీసీ లందరు తమ మద్దతు ప్రకటించించాలనీ కోరారు. బీసీల ఎదుగుదలను ఆకాంక్షించే వర్గాలన్ని తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. పార్లమెంట్ మలివిడీత సమావేశాల్లో డిల్లీ వేదికగా ఆకాంక్షలను, హాక్కుల ను సజీవ పంచుకొవడానికీ వ్యూహాత్మక ప్రణాళిక తో అడుగులు వేయబోతున్నామని అన్నారు. ఈ కార్యచరణ రాజ్యాంగానికి లోబడి పలు నిరసన ప్రదర్శనలు చేపట్టడం, పార్లమెంట్ ఎంపీ లతో వివిధ పార్టీల బీసీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం, అన్ని రాష్ట్రాల బీసీ నాయకులను సంఘాలను ఆర్గనైజ్ చేసి అవగాహన సదస్సులు,ఆన్ లైన్ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం కర్ణాటక నుంచి విచ్చేసిన బీసీ యువజన నాయకుడు శివకుమార్ చించోడిక మాట్లాడుతూ త్వరలో డిల్లీలో జరగబోయే బీసీ కార్యక్రమాలలో కర్ణాటక బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున హాజరవుతామి అన్నారు. కార్యక్రమం లో నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ నీలం వెంకటేష్, అడ్వకేట్ జేఏసీ ఛైర్మన్ నాగుల శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు జగనాథం ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి హరీష్ గౌడ్, తెలంగాణ బీసీ సంఘం నాయకులు తాటీకొండ సత్యనారాయణ చారి, ఓం ప్రకాష్ యాదవ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.