డిమాండ్‌ ఉన్న పంటనే వేయాలి – రైతులు తమ తల రాతను వారే రాసుకోవాలి

అందరూ వరి పండిస్తే కొనుగోళ్లు అసాధ్యం



డిమాండ్‌ ఉన్న పంటనే వేయాలి



రైతులు  తమ తల రాతను వారే రాసుకోవాలి


నియంత్రిత పంటలపై సిఎం కెసిఆర్‌ వివరణ

హైదరాబాద్‌,మే18(ఇయ్యాల తెలంగాణ ): ఏ పంటను ఎలా..ఎప్పుడు పండిరచానేది ప్రభుత్వమే చెబుతుందని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. వరిలో ఏయే రకాలు  వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని రైతును కోరారు. రైతు తమ తల రాతను తామే రాసుకోవాలని అన్నారు. వారు పండించిన  పంటకు గిట్టుబాటు ధరలు  రావడంతో పాటు డిమాండ్‌ రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. వర్షాకాంలో మక్క పంట వేయవద్దు..బదులుగా కందులు  వేయాలని సూచించారు. ’తెలంగాణ  సోనాకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. తెలంగాణ సోనాకు షుగర్‌ ఫ్రీ రైస్‌ అని పేరుంది.  యాసంగిలో మక్కలు  పండించాలి. సన్న రకాల్లో తెలంగాణ సోనా మంచిదన్నారు. వ్యవసాయం లో ఎవరు ఏ పంట వేయాలన్నదానిపై అధికారులు , కలెక్టర్లతో సిఎం కెసిఆర్‌ సవిూక్షించారు. ఇందులో భాగంగా సూచించిన పంటనే వేద్దాం అని అన్నారు.  40 లక్షల  ఎకరాల్లో వరి పంటలు  వేద్దాం. 2 లక్షల  ఎకరాల్లో కూరగాయు పండించాలి. నిజామాబాద్‌, జగిత్యాలలో పసుపు పంట వేసుకోవచ్చు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలో సోయాబిన్‌ వేసుకోవచ్చు. వరి పంటలో తెలంగాణ సోనా రకం పండించాలి. 10లక్షల  ఎకరాల్లో పండించాలని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పే పంటలు  రైతుతో వేయించే బాధ్యత కలెక్టర్లదే. త్వరలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రస్తుతం 25 లక్షల  టన్నుల  గోదాంలు  అందుబాటులో ఉన్నాయి.  త్వరలో న్యూస్‌ ఛానల్‌ ద్వారా రైతుతో ముఖాముఖి మాట్లాడుతా. తెలంగాణ పంటలన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యే రోజు రావాలని’ సీఎం కేసీఆర్‌ కోరారు. రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలోనే ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. కొన్ని రకాల  అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉందని తెలిపారు. తెలంగాణ అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు  అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో అమలు  చేసే పథకాలను అందరూ అనుసరిస్తున్నారని సీఎం తెలిపారు. ’నీటిపారుదల  ప్రాజెక్టుల  ఫలాలు  మనం చూస్తున్నాం. 24 గంట ఉచిత నాణ్యమైన విద్యుత్‌ తెలంగాణలో ఉంది.  వేలాది పాడిపశువులు  పంపిణీ చేసి ప్రోత్సాహకాలు  అందిస్తున్నాం.  అధునాతన పద్ధతుల్లో పంటలు  పండిరచేందుకు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాం.  5వేల  ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదే.  రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలి. తెలంగాణలో కాటన్‌ పంటకు అద్భుతమైన భవిష్యత్‌ ఉంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే వేయాలన్నారు.  70 లక్షల  ఎకరాల్లో పత్తిపంటను పండించాలి.  గతంలో 53 లక్షల  ఎకరాల్లో పత్తి పండిరచారు..ఈసారి 70 లక్షల  ఎకరాల్లో వేయాలి.  ప్రభుత్వం చెప్పినట్లు పంటలు  వేసి మంచి ధరను రైతు పొందాలి.  వ్యవసాయంలో మనం అన్ని రికార్డులను బద్ధలు కొడుతున్నాం. పాలిహౌజ్‌, గ్రీన్‌హౌజ్‌ కల్టివేషన్‌కు సబ్సిడీలు  ఇస్తున్నామని సీఎం వివరించారు. విూడియా సమావేశంలో మంత్రలు  ఈటెల  రాజేందర్‌, గంగుల  కమలాకర్‌ తదితరులు  పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....