కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా పై అనర్హత వేటు
హైదరాబాద్, జులై 25 (ఇయ్యాల తెలంగాణ) : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేసింది. అయన ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని కోర్టును జలగం వెంకట్రావు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. ఈసీకి తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు, వనమాకు ఐదు లక్షల జరిమానా విధించింది. 2018 ఎన్నికల్లో సవిూప అభ్యర్థిగా ఉన్న జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వనమా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు.