టీకా పై పంజేషా వైద్య బృందం ఇంటింటి అవగాహన

పలు ప్రాంతాల్లో వైద్య బృందం పర్యటన

హైదరాబాద్,ఆగస్టు 30 (ఇయ్యాల తెలంగాణ) : 

కోవిడ్ టీకా వేయించుకోండి  –  కరోనాను పారద్రోలండి అంటూ చార్మినార్ పరిధిలోని హెల్త్ సిబ్బంది ప్రజల్లో అవగాహనా పెంపొందిస్తున్నారు. సోమవారం ఆరోగ్య డాక్టర్లు, ఆయాలు, ఆశ వర్కర్ల తో కూడిన ప్రతినిధుల బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటించి టీకా యొక్క ఆవశ్యకతను వివరించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా తీసుకోవాలని సూచించారు. కోవిడ్ టీకా పై ఉన్న అపోహలను విడనాడాలని మనం కరోనా మహమ్మారి మూలంగా ఎంతటి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నామో గుర్తు చేసుకోవాలని వైద్య సిబ్బంది కోరారు. 

త్వరగా టీకా వేయుంచుకోండి  –

చార్మినార్ పరిధిలోని మొఘల్ పుర, అలీజా కోట్ల, పంజేషా, గుల్జార్ హౌస్, శాలిబండ తదితర ప్రాంతాల్లోని బస్తీల్లో పర్యటిస్తూ కోవిడ్ టీకా పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. రానా తబస్సుమ్, PHN పద్మ, ANM బాలమణి, ఆశ పూర్ణిమ, అహ్మది,అనూష, రుక్మినీ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....