ఝార్ఖండ్ CM గా మళ్లీ హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం !

ఝార్ఖండ్,  జూలై 4 (ఇయ్యాల తెలంగాణ) : ఝార్ఖండ్ సిఎంగా మళ్లీ హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌, హేమంత్‌ సోరెన్‌ చేత ప్రమాణం చేయించారు.భూకుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఈ ఏడాది జనవరిలో హేమంత్‌ సోరెన్‌ ను ఇడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టుకు ముందు ఆయన.. సిఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో చంపయీ సోరెన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన విడుదల అయ్యారు. 5 నెలలుగా జైలులో ఉన్న హేమంత్‌ సోరెన్‌.. మళ్లీ ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....