జ్ఞానవాపి మసీదు సర్వ నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు

వారణాసి జూలై 24 (ఇయ్యాల తెలంగాణ ): జ్ఞానవాపి మసీదు(లో పురావాస్తు శాఖ చేపడుతున్న సర్వేను రెండు రోజుల పాటు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కాశీ విశ్వనాథుడి ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో ఇవాళ ఉదయం ఏడు గంటలకు శాస్త్రీయ సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. సర్వే పేరుతో మసీదులో తొవ్వకాలు జరిగే ప్రమాదం ఉందని జ్ఞానవాపీ మసీదు మేనేజ్మెంట్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో సర్వేకు కోర్టు బ్రేక్‌ వేసింది. అయితే సర్వే వల్ల మసీదుకు ఎటువంటి ప్రమాదం ఉండదని, మసీదులో ఉన్న ఒక్క ఇటుకను కూడా తీయలేదని, అలాంటి ఉద్దేశం కూడా లేదని కోర్టుకు కేంద్రం వెల్లడిరచింది. సర్వేలో భాగంగా మసీదును కొలతలు తీసుకోవడంతో పాటు ఫోటోగ్రఫీ, రేడార్‌ స్టడీ చేయనున్నట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు.మసీదులో సర్వే కోసం జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తున్నామని, అయితే ఈ కేసులో ముస్లిం కమిటీ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీజే డీవై చంద్రచూడ్‌ తెలిపారు. జూలై 26వ తేదీ వరకు జిల్లా కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు సుప్రీం పేర్కొన్నది. ముస్లిం వర్గం సమర్పించే అఫిడవిట్‌ను హైకోర్టు ముందు ప్రవేశపెట్టాలని రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.ముస్లిం గ్రూపు తరపు సీనియర్‌ న్యాయవాది హుజేఫా అహ్మాది వాదించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని, ఇప్పటికే మసీదులోని పశ్చిమ గోడను తొవ్వడం ప్రారంభించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....