జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

లక్నో, ఆగష్టు 3 (ఇయ్యాల తెలంగాణ) : ఉత్తరప్రదేశ్‌ వారణాసి లో గల కాశీ విశ్వనాథ ఆలయ సవిూపంలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు పై అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే, మసీదులో సర్వే చేసేటప్పుడు నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరకూడదని స్పష్టం చేసింది.జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి జిల్లా కోర్టు జులై 21న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగ అధికారులు జులై 24న సర్వే ప్రారంభించారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. ఈ నేపథ్యంలోనే మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. సర్వేకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. న్యాయప్రయోజనాలదృష్ట్యాజ్ఞానవాపి మసీదులో సర్వే జరపడం అవసరమని పేర్కొంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....