జ్ఞానవాపి మసీదులో విగ్రహం త్రిశూలం ?

లక్నో, ఆగస్టు 7, (ఇయ్యాల తెలంగాణ ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ సర్వే కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి మొదలు పెట్టి సాయంత్రం 5 గంటల వరకూ షిఫ్ట్‌ల వారీగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ అక్కడ హిందూ ఆలయానికి సంబంధించిన కొన్ని సంకేతాలను గుర్తించారు అధికారులు. రెండ్రోజుల పాటు జరిగిన సర్వేలో వీటిని సేకరించిన అధికారులు వాటిని భద్రపరిచారు. బేస్‌మెంట్‌లో చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిందువులు చెబుతున్న ప్రకారం…మసీదు బేస్‌మెంట్‌లో నాలుగు అడుగుల శివుడి విగ్రహం దొరికింది. ఈ విగ్రహంతో పాటు 2 అడుగుల త్రిశూలం కూడా ఉంది. అంతే కాదు. అక్కడి గోడలపై కమలం పువ్వు గుర్తులు కనిపించినట్టు హిందువులు చెబుతున్నారు. ఓ జంతువు విగ్రహంతో పాటు, ఓ దేవత విగ్రహం కూడా గుర్తించినట్టు వివరించారు. మరి కొన్ని విగ్రహాల శకలాలు కనిపించినట్టు తెలిపారు. మూడో రోజు కూడా భారీ భద్రత నడుమ సర్వే జరుగుతోంది. మసీదులో పశ్చిమాన ఉన్న గోడపై హిందూ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు కనిపించడం వల్ల ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటి కోసం ప్రత్యేక యంత్రాలు తెప్పించి మరీ సర్వే చేస్తున్నారు. ‘‘మసీదులో పశ్చిమాన ఉన్న గోడపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాం. అక్కడ ఉన్న గడ్డిని పూర్తిగా తొలగించాం. మధ్యలో ఉన్న మినార్‌ నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. అవేంటని సర్వే చేస్తున్నాం. ఆ ప్రాంతాన్ని ఎవరో కావాలనే దాచి ఉంచినట్టు గుర్తించాం. అందుకే సర్వేకి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. కోర్టు మాకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. పని వేగంగానే జరుగుతోంది. రేడార్‌ మెషీన్‌ వినియోగించి సర్వే చేస్తున్నాం. ఫలితాలు వచ్చేంత వరకూ దయచేసి అంతా ఓపిక పట్టండి’’ఈ సర్వేపై పూర్తి నమ్మకంతో ఉన్నట్టు మరో అడ్వకేట్‌ సుధీర్‌ త్రిపాఠి వెల్లడిరచారు. ముస్లింలు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదని, సర్వేకి సహకరిస్తున్నారని అన్నారు. స్థానికంగా ఈ రూఎ సర్వేపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....