జూలై 3 వరకు 36 రైళ్లు రద్దు

హైదరాబాద్‌, జూన్‌ 24, (ఇయ్యాల తెలంగాణ ):ట్రాక్‌ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (ూఅఖీ) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. వీటిలో కొన్నిటిని ఒక్కోరోజు, మరికొన్ని అన్ని రోజులు రద్దుచేసినట్లు అధికారులు వెల్లడిరచారు. మేడ్చల్‌`సికింద్రాబాద్‌ మధ్య నడిచే రైళ్లను జూన్‌ 25, 26 తేదీల్లో, కాచిగూడ నుంచి రాయచూర్‌, మహబూబ్‌నగర్‌ వెళ్లే రైళ్లను జూన్‌ 26 (సోమవారం)న రద్దు చేసినట్లు పేర్కొన్నారు.ఇక కరీంనగర్‌ నుంచి నిజామాబాద్‌, సిర్పూరు టౌన్‌ మధ్య నడిచే రైళ్లను జూన్‌ 26 నుంచి జూలై 3 వరకు, కాజీపేట నుంచి డోర్నకల్‌, భద్రాచలం`విజయవాడ, సికింద్రాబాద్‌ నుంచి వికారాబాద్‌, వరంగల్‌ ప్యాసెంజర్‌ రైళ్లను ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వీటితోపాటు హైదరాబాద్‌`లింగంపల్లి`చందానగర్‌`ఫలక్‌నుమా`రామచంద్రాపురం మధ్య తిరిగే ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడిరచారు.కాజీపేట`డోర్నకల్‌ డోర్నకల్‌`కాజీపేట, డోర్నకల్‌`విజయవాడ`డోర్నకల్‌, భద్రాచలం` విజయవాడ` భద్రాచలం, సికింద్రాబాద్‌`వికారాబాద్‌`సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌`వరంగల్‌, వరంగల్‌`హైదరాబాద్‌, సిర్పూర్‌ టౌన్‌`కరీంనగర్‌`సిర్పూర్‌ టౌన్‌, కరీంనగర్‌`నిజామాబాద్‌`కరీంనగర్‌, కాజీపేట`సిర్పూర్‌ టౌన్‌, బళ్లార్షా`కాజీపేట`బళ్లార్ష, భద్రాచలం`బళ్లార్ష, సిర్పూర్‌ టౌన్‌` భద్రాచలం, కాచిగూడ`మహబూబ్‌నగర్‌`కాచిగూడ, కాచిగూడ`రాయచూరు, రాయచూర్‌` గద్వాల`రాయచూర్‌, రాయచూర్‌`కాచిగూడ, సికింద్రాబాద్‌`మేడ్చల్‌`సికింద్రాబాద్‌ రైళ్లు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....