జూలై 14 చంద్రయాన్‌…

నెల్లూరు,జూలై 7, (ఇయ్యాల తెలంగాణ ) : చంద్రుడిపై పరిశోధనలు లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపడుతున్నచంద్రయాన్‌ 3 ప్రయోగానికి తేదీ, సమయాన్ని ఇస్రో ప్రకటించింది. జూలై 14న మధ్యాహ్నం 2.35 నిమిషాలకి ప్రయోగం చేపడతామని ఇస్రో ట్వీట్‌ చేసింది.ఇటీవలే ఈ ప్రయోగంలో భాగంగా చంద్రయాన్‌`3 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్వీ`ఎంకే ఎఎఎ (జియోసింక్రోనస్‌ లాంచ్‌ వెహికల్‌ మార్క్‌ ఎఎఎ) తో అనుసంధానించారు. చంద్రుడిపైకి భారత్‌ ఉపగ్రహాన్ని పంపుతున్న మూడో ప్రయోగం ఇది. చంద్రయాన్‌`2 కు కొనసాగింపుగా దీన్ని ఇస్రో చేపడుతోంది. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ కోసం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ చేయగలిగాయి. జులై 13వ తేదీన చంద్రయాన్‌ `3 ప్రయోగాన్ని చేపట్టేందుకు అన్ని సిద్ధం చేస్తోంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీహరి కోట స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ మిషన్‌ ను చేపట్టనున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....