జూలైలో పేక మేడలు Movie


 పేక మేడలు సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘బూమ్‌ బూమ్‌ లచ్చన్న’ సాంగ్‌ విడుదల జూలైలో సినిమా విడుదల

’నా పేరు శివ’, ‘అంధగారం’ తదితర హిట్‌ చిత్రాల్లో నటించిన వినోద్‌ కిషన్‌ (పతినినీట ఐతిబష్ట్రజీని)ను ‘పేక మేడలు’తో హీరోగా అనూష కృష్ణ హీరోయిన్‌ గా నటిస్తున్న సినిమా పేక మేడలు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విశ్వక్సేన్‌ చేతుల విూద విడుదల చేయగా టీజర్‌ కు చాలా మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ బూమ్‌ బూమ్‌ లచ్చన్న విడుదలైంది.

లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న అంటూ సాగే ఈ సాంగ్‌ సింగర్‌ మనో గారు పాడగా లిరిక్స్‌ రాసింది భార్గవ్‌ కార్తీక్‌. స్మరణ్‌ సాయి అందించిన మ్యూజిక్‌ చాలా ఎట్రాక్టివ్‌ గా కొత్తగా ఉంది. ఈ పాట అధ్యంతం వినోదాత్మకంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్‌, కంటెంట్‌ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా జూలైలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు మూవీ టీం.

నటీనటులు :

వినోద్‌ కిషన్‌, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్‌, జగన్‌ యోగి రాజ్‌, అనూష నూతల, గణేష్‌ తిప్పరాజు, నరేన్‌ యాదవ్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....