జిన్‌పింగ్‌తో భేటీ కానున్న Modi

 న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మరోసారి భేటీ కాబోతున్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్న బ్రిక్స్‌ సదస్సు ఇందుకు వేదిక కానుంది. జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగే ఈ సదస్సుకు జిన్‌పింగ్‌ హాజరు అవుతారంటూ అధికారికంగా ప్రకటించింది చైనా విదేశాంగ శాఖ.  భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు చివరిసారిగా గతేడాది ఇండోనేషియా బాలిలో జరిగిన జీ20 సదస్సులో మాట్లాడుకున్నారు. అంతకుముందు ఉజ్బెకిస్తాన్‌లో ఒకే వేదికను పంచుకున్నా కనీసం పలకరించుకోలేదు మోదీ`జిన్‌పింగ్‌. దాంతో, ఇరువురి భేటీపై ఆసక్తి నెలకొంది.సౌదీ అరేబియా, యూఏఈ వంటి సన్నిహిత మిత్ర దేశాలు బ్రిక్స్‌లో చేరాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా పర్యటన చాలా కీలకమైంది. ఈ ఏడాది బ్రిక్స్‌ సదస్సులో అంతర్జాతీయ వ్యవహారాలు, పాశ్చాత్త దేశాల ఆధిపత్యం, భౌగోళిక రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలనే అంశాలపై చర్చించ నున్నారు. అయితే, భారత్‌`చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న టైమ్‌లో మోదీ`జిన్‌పింగ్‌ భేటీ ఆసక్తి రేపుతోంది. మరోవైపు   బ్రిక్స్‌లో చేరేందుకు దాదాపు 25 దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి. వాస్తవానికి బ్రిక్స్‌ ఐదు దేశాల సంస్థ.. దీనిని మరింతగా విస్తరించాలా వద్దా అనే దానిపై జోహన్నెస్‌బర్గ్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....