జార్ఖండ్‌ సైనిక కుటుంబాలకు సాయం సరే… తెలంగాణ అమరుల సంగతేమిటి ?

 

హైదరాబాద్‌ మార్చ్‌ 4 ( ఇయ్యాల తెలంగాణ ) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జార్ఖండ్‌ పర్యటన పై తెలంగాణ వైఎస్‌ ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల ఫైర్‌ అయ్యారు. శుక్రవారం జార్ఖండ్‌ కు వెళ్లి గల్వన్‌ లోయలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు ఆర్దిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమర జవాన్ల కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడం తప్పుకాదు. అలాగే ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పులేదు.కానీ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఎందుకు సాయం చేయరు ? అంటూ షర్మిల ప్రశ్నించారు. 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతు చించుకున్న మీరు అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారు ? అని ప్రశ్నించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....