జర్నలిస్టులను ఆదుకోండి – సిఎం కెసిఆర్‌కు ఎంపి రేవంత్‌ లేఖ


జర్నలిస్టులకు కరోనా టెస్టులు  చేయాలి

మనోజ్‌ కుటుంబానికి 50 లక్షల  పరిహారం
హైదరాబాద్‌,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ):  జర్నలిస్టులను ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి  లేఖ రాశారు. కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా జర్నలిస్టులు పనిచేస్తున్నారని లేఖలో తెలిపారు.            కష్ట కాంలో పనిచేస్తూ ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు. విూడియా ప్రతినిధులకు కరోనా రావడం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన జర్నలిస్ట్‌ మనోజ్‌  కుటుంబానికి రూ.50 లక్ష ల  ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని కోరారు. అలాగే కరోనా కాలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు నెలకు రూ.10 వేలు ఇవ్వా లని  డిమాండ్‌  చేశారు. అంతేకాకుండా జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల  బీమా కల్పించాలని లేఖలో రేవంత్‌రెడ్డి కోరారు. ఇటీవల కరోనా సోకి మృతిచెందిన తెలుగు జర్నలిస్ట్‌ మనోజ్‌ కుమార్‌ మృతిపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం వెంటనే మనోజ్‌ కుటుంబానికిరూ.50లక్షల  పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రతి జర్నలిస్ట్‌కు ఉచితంగా కరోనా టెస్టులు  చేయాలని సీఎం కేసీఆర్‌ కు రేవంత్‌ రెడ్డి లేఖ
రాశారు. కరోనా సమయంలో జర్నలిస్టు భద్రత, సహకారం గురించి.. లేఖలో ప్రస్తావిస్తూ? ఒక్క అక్షరం లక్ష మెదళ్లను కదిలిస్తుంది. ఈ ఒక్క వాఖ్యం చాలు  సమాజంలో విలేకరుల  పాత్ర ఏమిటి అన్నది చెప్పడానికి. ప్రజాస్వామ్యంలో విూడియా పాత్ర అనిర్వచనీయం. అత్తెసరు జీతాలు, అర్దాకలి జీవితాలతో అనుక్షణం ప్రజలకు సమాచారం చేర వేయడమే శ్వాసగా, ధ్యాసగా విూడియా ప్రతినిధులు పని చేస్తున్నారు.కరోనా  సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉండి, సాహసో పేతంగా విధులు నిర్వహిస్తున్నారు.  కష్ట కాంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాజా పరిస్థితుల పై క్షణ క్షణం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు విూడియా ప్రతినిధులు  కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. యువ విలేకరి మనోజ్‌ కుమార్‌ కరోనా సోకి మరణించిన సందర్బం హృదయాన్ని కలచి వేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టు భద్రత విషయంలో తక్షణం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టు మిత్రుడికి ఉచితంగా కరోనా పరీక్షలు  నిర్వహించాలి. ప్రతి  జర్నలిస్టు కుటుంబానికి ఈ సంక్షోభ సమయంలో నెలకు రూ.10 వేలు  ఆర్థిక సాయం చేయాలి. ఇటీవల  మృతి చెందిన మనోజ్‌ కుమార్‌ కుటుంబానికి రూ.50 లక్షలు  పరిహారం ఇవ్వాలి. వీటి పై తక్షణం స్పందించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ ను డిమాండ్‌ చేస్తున్నాను. లేనిపక్షంలో జర్నలిస్టు సమాజంలో విూరు మానవత్వం లేని మనిషిగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నాను. అని రేవంత్‌ రెడ్డి లేఖలో పేర్కోన్నారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....